This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

Pregnancy
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
 ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
Likes16 Likes|
Read time5 min

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంటను త్వరగా తగ్గించుకోవడం ఎలా?

గుండెల్లో మంట అనేది ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా మొదటి మూడు నెలలలో తప్పకుండా ఉండే లక్షణం. ప్రెగ్నెన్సీలో అందరికీ ఏదో ఒక సమయంలో గుండెల్లో మంట వస్తుంది. కానీ చాలా మంది మహిళలకు తీవ్రమైన లక్షణాలు ఉండి, కొన్ని వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అసౌకర్యానికి, బాధకు గురిచేస్తుంది. అదృష్టవశాత్తూ, తల్లి కాబోయే వారు ఈ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే టిప్స్ కొన్ని ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంటను తగ్గించే సాధారణ చిట్కాలను చూసే ముందు, ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటో తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటి?

సాధారణంగా పొట్టలోని ఆమ్లాలు వెనక్కి వచ్చి అన్నవాహికను చికాకు పెట్టడం వల్ల ఛాతీలో లేదా గొంతులో మంటగా ఉండటమే గుండెల్లో మంట. అన్నవాహిక నోటిని, జీర్ణాశయాన్ని అనుసంధానిస్తుంది. గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లక్స్ - అంటే జీర్ణాశయంలో పదార్థాలు తిరిగి అన్నవాహికలోకి ప్రవహించడం వల్ల వస్తుంది. చాలా సందర్భాలలో, ఆహారం, ద్రవాలు చాలా త్వరగా కడుపులోకి వెళ్ళి అన్నవాహిక ఖాళీ అవడం వల్ల ఇలా జరుగుతుంది. సాధారణంగా గుండెల్లో మంట తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో (సర్వసాధారణంగా మొదటి మూడు నెలలలో) ఎప్పుడైనా రావచ్చు. అయినప్పటికీ, ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ లోపలి కారణానికి చికిత్స చేయకపోతే అవి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మళ్ళీ రావచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అజీర్ణానికి గల 5 కారణాలు

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి?

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట యొక్క సాధారణ లక్షణాలు:

  • ఛాతి, గొంతులో మంట, చివరికి నోటిలో కూడా మంట రావటం
  • వికారం, కడుపు నొప్పి
  • వాంతులు అవడం
  • పడుకున్నప్పుడు అసౌకర్యం
  • నిద్ర పట్టడంలో ఇబ్బంది (కాలిపోతున్నట్టు అనిపించడం వల్ల)
  • నోటి దుర్వాసన
  • నూనె పదార్థాలు లేదా వేయించిన ఆహారాన్ని తిన్న తర్వాత ఇబ్బందిగా అనిపించటం

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట ఎక్కువగా ఉండటానికి ఏ అంశాలు కారణం అవుతాయి?

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట, ఇతర జీర్ణ సమస్యలు బాధాకరంగాను, అసౌకర్యంగాను ఉంటాయి. అలాంటప్పుడు పొట్ట పైభాగంలో ఉన్న స్పింక్టర్ చాలా త్వరగా పక్కకు తప్పుకోవడం వల్ల ఛాతిలో అసౌకర్యం కలుగుతుంది. నూనె పదార్థాలు, కారంగా ఉండే ఆహారాలు, ఆల్కహాల్, కెఫిన్ తీసుకున్న తర్వాత మంట తరచుగా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకి గుండెల్లో మంట ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం, పెరుగుతున్న గర్భాశయం పొట్టపై ​​ఒత్తిడి తెచ్చి, కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట రావడానికి అనేక కారణాలున్నాయి. అవి:

  • యాంటినోసియా మందులు
  • చాలా వేగంగా తినడం (కడుపు త్వరగా ఖాళీ అయ్యేలా చేస్తుంది)
  • ఒకేసారి ఆహారాన్ని అతిగా తినడం (కడుపులో అధిక మొత్తంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది)
  • కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం (రిఫ్లక్స్ కారణమవుతుంది)
  • ధూమపానం (యాసిడ్ రిఫ్లక్స్ కారణమవుతుంది)
  • భోజనం చేసిన వెంటనే పడుకోవడం
  • స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం

గర్భం పెద్దదయ్యే కొద్దీ గుండెల్లో మంట కూడా ఎక్కువవుతుందని పరిశోధకులు గుర్తించారు. ప్రధానంగా గర్భాశయం పొట్ట, జీర్ణ వ్యవస్థలోని అవయవాలపై ఒత్తిడిని పెంచడం వల్ల ఇలా జరుగుతుంది.

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంటను ఎలా తగ్గించాలి?

ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట నుండి ఉపశమనం పొందేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిలో కొన్నింటికి ఆల్కహాల్ తక్కువగా తాగడం లేదా స్పైసీ ఫుడ్స్‌ను తీసుకోకపోవడం వంటి తేలికపాటి ఆహార మార్పులు మాత్రమే అవసరమవుతాయి. అయితే కొన్నింటికి కెఫీన్‌ మానేయడం, రోజంతా తక్కువ మొత్తంలో భోజనం తినడం వంటి మరింత తీవ్రమైన మార్పులను చేయవలసి ఉంటుంది. తల్లి కాబోయే వారు వారికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకొనే ముందు అనేక విధానాలను ప్రయత్నించాలి. సాధారణ ఇంటి చిట్కాలను అనుసరించి ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంటను ఎలా వదిలించుకోవాలో తెలియజేసే కొన్ని టిప్స్ ఇవి:

1. పుష్కలంగా నీరు తాగాలి

ఉబ్బరం తగ్గించడానికి నీరు సహాయపడుతుంది, ఇది తరచుగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. రోజుకు ఎనిమిది గ్లాసులు త్రాగడానికి ప్రయత్నించండి!

2. కొద్ది కొద్దిగా భోజనం తినండి

ఆహారం తక్కువ తినడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. కొద్దికొద్దిగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి శరీరానికి సులభం అవుతుంది.

3. అతిగా తినవద్దు

హైడ్రేటెడ్‌గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల తల్లి కాబోయే వారికి కాస్త ఉపశమనంగాను, అనారోగ్యానికి గురికాకుండాను ఉండటానికి సహాయపడతుంది. అయినా గుండెల్లో మంట తగ్గకపోతే, ప్రిలోసెక్ (ఒమెప్రజోల్) లేదా నెక్సియం (ఎసోమెప్రజోల్) వంటి ఓవర్-ది-కౌంటర్ మందులను ప్రయత్నించండి.

4. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు పడుకోకూడదు

తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది, తద్వారా గుండెల్లో మంట పెరుగుతుంది. తల్లి కాబోయే వారు భోజనం చేసిన వెంటనే పడుకోవడం కంటే కొంచెంసేపు నడవడం చాలా మంచిది.‌

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీలో ఎదుర్కొనే సాధారణ సమస్య గుండెల్లో మంట. కానీ, ఇదేమీ చిన్న విషయం కాదు, ఎందుకంటే ఛాతిలో, గొంతులో మండుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే, దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి తల్లి కాబోయే వారు గుండెల్లో మంట గురించి డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి? గుండెల్లో మంటను ఎదుర్కోవడంలో ఇంటి చిట్కాలు, జీవనవిధానంలో మార్పులు, ఓ.టి.సి మందులు పని చేయకపోతే, వెంటనే వైద్యుడిని కలవాలి. అలాగే, ఓ.టి.సి మందుల వల్ల గుండెల్లో మంట ఇంకా పెరిగితే, వెంటనే డాక్టర్‌ని కలవాలి. చివరగా, డెలివరీ అయిన చాలా రోజుల తర్వాత కూడా గుండెల్లో మంట తగ్గకపోతే, డాక్టర్‌ని కలవాలి, ఎందుకంటే లోపల ఏదో అనారోగ్యం ఉందని దీని అర్థం.

చివరిగా

గుండెల్లో మంట అనేది ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఉండే లక్షణం. ఇది మొదటి మూడు నెలలలోనే మొదలవుతుంది. జీర్ణాశయంలోని యాసిడ్ పైకి తన్నినప్పుడు అది అన్నవాహికలో మంటకి కారణమవుతుంది, ఇది అసౌకర్యంగాను, బాధాకరంగాను ఉంటుంది. గర్భధారణ సమయంలో గుండెల్లో మంటను ఎలా అదుపులో పెట్టుకోవాలి, దానిని ఎలా తగ్గించాలి, ఎలా ఉపశమనం పొందాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మౌనంగా బాధపడకండి - ఉపశమనం పొందడానికి ఏమి చేయవచ్చో తెలుసుకోవడానికి డాక్టర్‌తో మాట్లాడండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.